హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాల మళ్లింపు
- April 21, 2022హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. వర్షం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌కు రావాల్సిన పలు విమానాలను మళ్లించారు. రెండు ఇండిగో విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు అధికారులు మళ్లించారు. ఢిల్లీ, ముంబై నుంచి రావాల్సిన విమానాలను బెంగుళూరుకు మళ్లించారు. గచ్చిబౌలి, షేక్‌పేట్, గోల్కొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది. యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, ఉప్పల్‌లో వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల