ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక & వేదిక వివరాలు...
- April 21, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న మెగా మూవీ ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కాజల్ , పూజా హగ్దే లు హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో చిత్ర ప్రమోషన్స్ ఫై దృష్టి సారించిన మేకర్స్…వరుస ఇంటర్వూస్ తో సినిమా తాలూకా విశేషాలను మీడియా తో పంచుకుంటున్నారు.ఇదిలా ఉంటె ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక కు సంధించిన విశేషాలను అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 23 న యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరపబోతున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజమౌళి , మహేష్ బాబు లు హాజరు కాబోతున్నట్లు అంటున్నారు. కానీ వీరిలో ఎవరు వస్తారనేది..అసలు వస్తారా రారా అనేది కూడా చూడాలి. మొదట విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలనీ భావించారు.అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ మళ్లీ ఏమైందో ఏమోకానీ వేదికను హైదరాబాద్ కు మార్చారు.
ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







