తబుక్ పర్వతాల్లో చిక్కుకున్న యువకుడిని రక్షించిన సివిల్ డిఫెన్స్

- April 22, 2022 , by Maagulf
తబుక్ పర్వతాల్లో చిక్కుకున్న యువకుడిని రక్షించిన సివిల్ డిఫెన్స్

సౌదీ: తబుక్-వాయువ్య సౌదీ అరేబియాలోని అబు రాకా సెంటర్‌లో రెండు రాతి కొండల మధ్య ఇరుకైన ప్రాంతంలో చిక్కుకున్న యువకుడిని పౌర రక్షణ దళాల రెస్క్యూ మిషన్‌ సిబ్బంది రక్షించాయి.తీవ్రంగా గాయపడ్డ సదరు వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా అబు రాకా జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పుడు అతని పరిస్థితి నిలకడగా ఉంది.ఆ వ్యక్తి పర్వత పగుళ్లలో పడిన బాధాకరమైన క్షణాన్ని డాక్యుమెంట్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్‌లు అతనిని రక్షించేందుకు అనేక గంటలపాటు నిరంతరం శ్రమించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి యువకుడు నిలబడి ఉన్న స్థితిలో ఇరుకైన సందులో ఇరుక్కుపోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దాదాపు 30 గంటల పాటు పలు భద్రతా బృందాలు సహాయక చర్యలను కొనసాగించాయి.యువకుడిని రక్షించడంలో రెడ్ క్రెసెంట్ అథారిటీ, అబు రాకా మునిసిపాలిటీ యూనిట్లతోపాటు సివిల్ డిఫెన్స్ కు వాలంటీర్లు తమ వంతు సహాయం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com