యూఏఈలో పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్ పొందడం ఎలా?
- April 22, 2022
యూఏఈ: సంపాదించిన మొత్తం ఖర్చులకే సరిపోయే పరిస్థితుల్లో అదనపు సంపాదన కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాల వేటలో చాలామంది వుంటారు.కానీ, యూఏఈలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి కొన్ని నిబంధనలున్నాయి.
యూఏఈలో పార్ట్ టైమ్ ఉద్యోగానికి సంబంధించిన కొత్త రూల్స్..
ఎంవోహెచ్ఆర్ఈ కొత్త రూల్స్ ప్రకారం యూఏఈలో కంపెనీలు పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఉద్యోగుల్ని దేశం లోపల, దేశం వెలుపల కూడా నియమించుకోవచ్చు.ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ ఓ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.ఎమిరాతీలు, నాన్ ఎమిరాతీలు కూడా ఇలా పార్ట్ టైమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అయితే, ఇందుకోసం ప్రైమరీ ఎంప్లాయర్ నుంచి అనుమతి తప్పనిసరి. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ నాజర్ బిన్ తని అల్ హామ్లి ఈ మేరకు ఓ రిజల్యూషన్ విడుదల చేశారు.
మినిస్ట్రీ నుంచి తస్హీల్ ద్వారా అనుమతిని పార్ట్ టైమ్ ఉద్యోగార్ధులు పొందాలి. గతంలో మొదటి ఎంప్లాయర్ నుంచి అనుమతి తప్పనిసరి కాగా, ఇప్పుడు అది అవసరం లేదు.
పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్ పొందేందుకోసం చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ కాపీ, వీసా కాపీ, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఎమిరేట్స్ ఐడీ కాపీ లేదా లేబర్ కార్డు లేదా కాంట్రాక్ట్ కాపీ, ఎస్టాబ్లిష్మెంట్ కార్డు (రెండు కంపెనీలకు చెల్లేలా) వుండాలి.ప్రైమరీ ఎంప్లాయర్ 150 నుంచి 2000 దిర్హాములు చెల్లించాల్సి వుంటుంది.రెండో ఎంప్లాయర్ 100 దిర్హాములు చెల్లించాలి పార్ట్ టైమ్ అనుమతుల నిమిత్తం.
చెల్లుబాటయ్యే వీసా మరియు ఎమిరేట్స్ ఐడీ వున్నవారు, 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు, గవర్నమెంట్ మరియు ఫ్రీ జోన్ ఉద్యోగులు, తమ కుటుంబాలకు సంబంధించిన రెసిడెన్సీస్ అనుగుణంగా వున్నవారు.. పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్లు పొందవచ్చు.
టెక్నికల్ ప్రొఫెషన్స్ కోసం యూనివర్సిటీ డిగ్రీ కలిగి వుండాలి. కొన్ని ప్రత్యేకమైన టెక్నికల్ ప్రొఫెషన్స్‌కి రెండు లేదా మూడేళ్ళ పోస్ట్ సెకెండరీ ఇనిస్టిట్యూషనల్ శిక్షణ తప్పనిసరి. పార్ట్ టైమ్ వర్క్ అంటే 8 గంటల కంటే తక్కువ పని చేయాలి.. వారంలో ఓ రోజు సెలవు వుండాలి. బిజిట్ లేదా టూరిస్ట్ వీసా కలిగినవారు పార్ట్ టైమ్ వర్క్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. 65 ఏళ్ళ పై వయసు వున్నవారికి ఇది వర్తించదు.యూఏఈ లేబర్ చట్టానికి అనుగుణంగా వర్కర్లు పని చేయాలి.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







