డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్‌కు జోష్...
- April 22, 2022
న్యూ ఢిల్లీ: డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ మంచి గణాంకాలనే నమోదు చేసింది.గత ఏడాది నవంబర్ 1న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటివరకు డిజిటల్‌గా 2.6 కోట్ల మంది సభ్యత్వాలు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.డిజిటల్ పద్ధతిలో కాంగ్రెస్ మెంబర్‌షిప్ కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది నుంచి వరుసగా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కాంగ్రెస్ డేటా అనలిస్టిక్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘సభ్యత్వ నమోదు కోసం నాలుగు అంచెల ప్రక్రియను అనుసరించాం.పార్టీ అనుమతించిన నాయకులు మాత్రమే ఈ సభ్యత్వ నమోదు చేపట్టారు. పూర్తి పారదర్శకంగా ఈ కార్యక్రమం సాగింది. ఓటీపీ, వోటర్ ఐడీ ఆధారంగా, కార్యకర్తల ఫొటో తీసుకుని సభ్యత్వం ఇచ్చాం’’ అని ప్రవీణ్ చెప్పారు.ఈ కార్యక్రమం మరికొంతకాలం సాగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







