వెనుకబడిన వర్గాల పిల్లల డిజిటల్ అక్షరాస్యత కోసం ‘వరల్డ్ ఆన్ వీల్స్’
- April 22, 2022
హైదరాబాద్: దేశాన్ని డిజిటల్ సాధికారత కలిగిన సమాజం, నాలెడ్జ్ ఎకానమీగా మార్చడానికి భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతునిస్తూ, GMR వరలక్ష్మి ఫౌండేషన్, HP (Hewlett Packard) భాగస్వామ్యంతో వరల్డ్ ఆన్ వీల్స్ (WoW) అనే ప్రత్యేకమైన CSR కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ భాగస్వామ్యం ద్వారా GMRVF, HP సమాజంలోని వెనుకబడిన వర్గాల వారిలో, డిజిటల్ అక్షరాస్యతలోని అంతరాన్ని తగ్గించడం, డిజిటల్ ఎనేబుల్డ్ కమ్యూనిటీలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
వరల్డ్ ఆన్ వీల్స్ (WoW) కార్యక్రమంలో మొబైల్ ఐటీ సదుపాయాలు కలిగిన బస్సు ద్వారా విద్యార్థులకు ప్రాథమిక కంప్యూటర్ అక్షరాస్యత మాడ్యూల్స్‌ను పరిచయం చేస్తారు. ఈ WoW బస్సు GMRVF తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, శంషాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చెంతకు వెళుతుంది. HP వారి CSR ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేయబడిన ఈ WoW బస్సులో 20 మంది విద్యార్థులు ఏకకాలంలో డిజిటల్ పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ WoW లెర్నింగ్ ల్యాబ్‌లో లెర్నింగ్ మాడ్యూల్స్‌తో కూడిన కంప్యూటింగ్, ప్రింటింగ్ పరికరాలు ఉంటాయి.

వరల్డ్ ఆన్ వీల్స్ లోని ప్రత్యేకాంశాలు
- ఏడాదికి 44 వేల ట్రైనింగ్ గంటల సామర్థ్యం
- విద్యుత్ అవసరం లేకుండా 3.15 KVA సోలార్ ప్యానెల్స్
- క్లాస్‌రూమ్ మేనేజర్, ఇతర సాఫ్ట్‌వేర్ సూట్స్
- యువత కోసం EDP ట్రైయినింగ్, విద్యార్థుల కోసం K-12 e- కాంటెంట్
- వీడియో కాన్ఫరెన్సింగ్, రిమోట్ ట్రెయినింగ్
- 20 HP థిన్ క్లయింట్స్, వర్క్ స్టేషన్, ఆఫీస్ జెట్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్
మొబైల్ కంప్యూటర్ ల్యాబ్‌గా అభివృద్ధి చేయబడిన ఈ ప్రత్యేకమైన WoW బస్సు ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం చుట్టుపక్కల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళుతుంది. నిర్ణీత పాఠశాల క్యాంపస్‌లో బస్సును రోజంతా ఉంచుతారు. GMRVF కు చెందిన ఒక ఇన్‌స్ట్రక్టర్ విద్యార్థులకు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను రూపొందించిన ఒక పద్ధతి ప్రకారం మాడ్యూల్ సెషన్‌ల ద్వారా బోధిస్తారు. అన్ని మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యతలో సుశిక్షితులవుతారు.
GMR వరలక్ష్మి ఫౌండేషన్ CEO అశ్వని లోహాని మాట్లాడుతూ “మన చుట్టూ ఉన్న స్థానిక ప్రజలలో డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి GMRVF కట్టుబడి ఉంది.డిజిటల్ నైపుణ్యాలు ఉజ్వల భవిష్యత్తుకు ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.సమాజంలో సామాజిక-ఆర్థిక వాతావరణంలో మార్పు తీసుకురావడంలో దాని ప్రభావం చాలా ఉంది.భారతదేశంలో డిజిటల్ అక్షరాస్యతకు తెలంగాణ కేంద్రంగా ఉంది.హెచ్‌పీతో మా భాగస్వామ్యం ద్వారా డిజిటల్ నైపుణ్యాలు లేని విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం విద్యార్థులు మంచి కెరీర్ అవకాశాలను పొందడంలో సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము.’’ అన్నారు.
డిజిటల్ అక్షరాస్యతతో పాటు, ఆరోగ్యం, కోవిడ్ మరియు రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లపై అవగాహన కల్పించేందుకు GMRVF ఈ వరల్డ్ ఆన్ వీల్స్‌ను ఉపయోగించుకుంటుంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ బస్సు పర్యటిస్తుంది.బస్సు వెనుక భాగంలో అమర్చిన పెద్ద స్క్రీన్‌పై సామాజిక అవగాహనపై లఘు చిత్రాలను గ్రామస్థుల కోసం ప్రదర్శిస్తారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్,భూమి రికార్డులు మొదలైన అంశాల గురించి సాధారణ అవగాహన సెషన్‌లను కూడా GMRVF సిబ్బంది స్థానికులకు వివరిస్తారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







