IPL2022: బెంగళూరు పై హైదరాబాద్ ఘన విజయం
- April 24, 2022
హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ 15లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా విజయాలు నమోదు చేస్తోంది హైదరాబాద్.తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ అదరగొట్టింది.ఆల్ రౌండ్ ప్రదర్శనతో బెంగళూరు పై ఘన విజయం సాధించింది.
బెంగళూరు నిర్దేశించిన 69 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 8 ఓవర్లలోనే ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. హైదరాబాద్ బౌలర్లు నిప్పులు చెరగడంతో 68 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టుకి ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. ఈ విజయంతో హైదరాబాద్ (10) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. 12 పాయింట్లతో టాప్ 1 లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







