దొంగతో పోరాడిన ఇండియన్ హౌస్‌మెయిడ్
- April 05, 2016
బహ్రెయిన్‌లో ఓ ఇండియన్ హౌస్‌మెయిడ్, హ్యాండ్ బ్యాగ్ దొంగని ధైర్యంగా ఎదిరించిన ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జింజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళలోని కొల్లాంకి చెందిన లైలా, రోడ్డుపై వెళుతుండగా ఓ వ్యక్తి ఆమెను అటకాయించే ప్రయత్నం చేశాడు. మొదట బస్ స్టాప్ గురించి అడిగాడనీ, ఆ తర్వాత తన బ్యాగ్‌ని దొంగిలించేందుకు ప్రయత్నించాడని ఆమె తెలిపింది. ఈలోగా దూరంగా ఓ వ్యక్తి వస్తున్న జాడ కనిపించడంతో ఆ దొంగ పారిపోవడానికి ప్రయత్నించగానే, అక్కడే ఉన్న రాయిని తీసుకుని అతనిపైకి విసరగా, దొంగ అక్కడే కిందపడిపోయాడని, వెంటనే అతన్ని పట్టుకున్నానని, అయితే ఇదంతా చూస్తూ ఎవరూ ముందుకు రాలేదని లైలా చెప్పారు. నాలుగేళ్ళ క్రితం బహ్రెయిన్‌కి వచ్చారు లైలా, ఆమె భర్తతో కలిసి. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







