టాక్సీ డ్రైవర్ను సన్మానించిన దుబాయ్ పోలీసులు
- April 24, 2022
దుబాయ్: టాక్సీలో ప్రయాణికుడు మరచిపోయిన హ్యాండ్ బ్యాగ్ ను నిజాయితీగా తిరిగిచ్చిన దుబాయ్ టాక్సీ డ్రైవర్ అబ్దుల్రహీమ్ మ్జోమిడియర్ రాజీఫ్ను అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సన్మానించారు. ప్రయాణికుడు మరచిపోయిన హ్యాండ్ బ్యాగ్ లో నగదుతోపాటు విలువైన పత్రాలు, పాస్ పోర్ట్ ఉన్నాయి.ఈ సందర్భంగా బెంగాలీ డ్రైవర్ అబ్దుల్రహీమ్ మ్జోమిడియర్ రాజీఫ్ నిజాయితీని అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్హలీమ్ ముహమ్మద్ అహ్మద్ అల్ హషిమి ప్రశసించారు. పోలీసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాజీఫ్ మాట్లాడుతూ.. దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దొరికిన విలువైన వస్తువులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడం లేదా సమీపంలోని పోలీసు స్టేషన్లకు అప్పగించడం ప్రతి ఒక్కరి విధి అని అన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







