దిల్ రాజు నిర్మాతగా బిగ్ బాస్ విన్నర్ సన్నీ వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'
- April 25, 2022ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ "ఏటీఎమ్". జీ5 సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు సి చంద్ర మోహన్ "ఏటీఎమ్" వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, దివి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతంలో ఈ సిరీస్ గురించి గ్రాండ్ గా చేసిన ప్రకటన టాలీవుడ్ ను ఆకర్షించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. థ్రిల్లర్ కథతో "ఏటీఎమ్" వెబ్ సిరీస్ రూపొందనుంది. ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందిస్తుండగా...పీజీ విందా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు