ద్వేష రాజకీయాలకు ముగింపు పలకండీ: ప్రధానికి 100కిపైగా మాజీ బ్యూరోక్రాట్ల లేఖ
- April 27, 2022
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ మౌనం వీడాలని..దేశంలో విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతూ 100 మందికిపైగా మాజీ బ్యూరోక్రాట్లు (జాతీయ సర్వీసుల మాజీ అధికారులు) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల మాజీ బ్యూరోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. “దేశంలో ద్వేషంతో నిండిన విధ్వంసం ఉన్మాదాన్ని మనం చూస్తున్నామని ఆందోళన వ్యక్తంచేశారు.
''మనం ఎదుర్కొంటున్న ప్రమాదం అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత, వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం బధిరత్వంతో సమానం'' అని లేఖలో వారు పేర్కొన్నారు.అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా..కొన్ని నెలలుగా మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అన్న హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారు. మీ పార్టీ నియంత్రణలోని ప్రభుత్వాల పరిధిలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ పిలుపు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికెఎ నాయర్ సహా 108మంది లేఖ రాసిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







