సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూత!
- April 28, 2022
ముంబై: సీనియర్ బాలీవుడ్ నటుడు సలీమ్ గౌస్ (70) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆయన భార్య అనిత సలీమ్ ధృవపరిచారు. ‘బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీమ్ చెప్పడంతో, కోకిలాబెన్ హాస్పిటల్ లో చేర్చామని, గురువారం ఉదయం ఆయన హార్ట్ అటాక్ తో కన్నుమూశార’ని ఆమె తెలిపారు. ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్ లో సలీమ్ గౌస్ కీలకపాత్రలు పోషించారు. అలానే ‘సారాంశ్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషీ హాజిర్ హో, త్రికాల్, అఘాత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్, వెల్ డన్ అబ్బా’ వంటి చిత్రాలలో సలీమ్ నటించారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉన్న సలీమ్ గౌస్ తెలుగులో ‘అంతం, రక్షణ, ముగ్గురు మొనగాళ్ళు’ తదితర చిత్రాల్లో నటించడం విశేషం.సలీమ్ గౌస్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







