సీనియర్ నటుడు సలీమ్ గౌస్ కన్నుమూత!
- April 28, 2022ముంబై: సీనియర్ బాలీవుడ్ నటుడు సలీమ్ గౌస్ (70) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆయన భార్య అనిత సలీమ్ ధృవపరిచారు. ‘బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీమ్ చెప్పడంతో, కోకిలాబెన్ హాస్పిటల్ లో చేర్చామని, గురువారం ఉదయం ఆయన హార్ట్ అటాక్ తో కన్నుమూశార’ని ఆమె తెలిపారు. ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్ లో సలీమ్ గౌస్ కీలకపాత్రలు పోషించారు. అలానే ‘సారాంశ్, మంథన్, కలియుగ్, చక్ర, మోహన్ జోషీ హాజిర్ హో, త్రికాల్, అఘాత్, ద్రోహి, సోల్జర్, మహారాజా, ఇండియన్, వెల్ డన్ అబ్బా’ వంటి చిత్రాలలో సలీమ్ నటించారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రవేశం ఉన్న సలీమ్ గౌస్ తెలుగులో ‘అంతం, రక్షణ, ముగ్గురు మొనగాళ్ళు’ తదితర చిత్రాల్లో నటించడం విశేషం.సలీమ్ గౌస్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..