యాదగిరిగుట్ట పై కొత్త పార్కింగ్ ఫీజులు..
- May 01, 2022
తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించని అధికారులు.. భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే సొంత వాహనాల్లో నేరుగా కొండపైకి వెళ్లాలనుకునే వారికోసం తాజాగా అనుమతి ఇచ్చిన అధికారులు... పార్కింగ్ ఫీజు మాత్రం కళ్లుచెదిరేలా నిర్ణయించారు. యాదగిరి గుట్టపై వాహనాల పార్కింగ్ పేరుతో భక్తులను నిలువు దోపిడి చేసేందుకు ఆలయ కమిటీ సిద్ధమైంది. కొండపైకి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత గంటకు అదనంగా వంద రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ ఛార్జీలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనాల పార్కింగ్ కోసం కొండపై ఆర్టీసీ బస్టాండ్ పక్కన స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు, వీఐపీలు,దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







