అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..
- April 05, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 8న హీరో బాలకృష్ణ తాను నటించబోయే వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను వెల్లడించనున్నారు. అమరావతి (అప్పటి ధాన్య కటకం.. ఇప్పటి ధరణికోట రాజధానిగా చేసుకుని శాతవాహనులు సుధీర్ఘకాలం పరిపాలిం చారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతిగా నామ కరణం చేయడం సర్వజనామోదం పొందింది. శాతవాహన చివరి చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత వృత్తాంతాన్ని ప్రస్తుతం వెండితెరపైకి తీసు కువచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్నారు. శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచె సినిమా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ అమరావతిలో తొలిసారి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఇది ఘన విజ యం సాధించింది. అదే సెంటిమెంట్‌తో ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో బాలకృష్ణ తన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో శా తవాహనుల చరిత్ర నేటి తరానికి తెలియనుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







