డ్రైవింగ్‌: ఆల్కహాల్‌ కన్నా మొబైల్‌ ఫోన్‌ ప్రమాదకరం

- April 05, 2016 , by Maagulf
డ్రైవింగ్‌: ఆల్కహాల్‌ కన్నా మొబైల్‌ ఫోన్‌ ప్రమాదకరం

డ్రైవింగ్‌ సమయంలో ఆల్కహాల్‌ కన్నా మొబైల్‌ ఫోన్‌ ప్రమాదకరమని వివిధ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించారు. ఆల్కహాల్‌ సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారికన్నా డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వాడకం దారులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నారని రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ వాడుతూ వాహనాలు నడిపేవారికి 35 ఒమన్‌ రియాల్స్‌ ఫైన్‌ విధిస్తున్నారు. దీన్ని 300 ఒమన్‌ రియాల్స్‌కి పెంచడంతోపాటు నెల రోజుల నుంచి 2 ఏళ్ళ జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేయడం కుదరదనీ, ప్రమాదాల నివారణకు చైతన్యం పెంచడమే మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాయల్‌ ఒమన్‌ పోలీసులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com