వాహనాల శబ్దకాలుష్యంపై యూఏఈ కొరడా
- April 05, 2016
వాహనాల ద్వారా విడుదలయ్యే శబ్దకాలుష్యంపై యూఏఈ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అతి తీవ్రత గల శబ్ద కాలుష్యాన్ని గుర్తించేందుకు రోడ్లపై రాడార్లను అమర్చుతున్నారు. ఈ రాడార్లు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే వాహనాల్ని గుర్తిస్తాయని అధికారులు చెప్పారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ అబుదాబీ పోలీస్ హెడ్ కెప్టెన్ అహ్మద్ అబ్దుల్లా అల్ ముహైరి ఈ రాడార్ని కనుగొన్నారు. ఇందులోని సౌండ్ ఇంటెన్సిటీ సెన్సార్ నిబంధనల్ని ఉల్లంఘించే వాహనాన్ని గుర్తించి, ఫొటోలు తీస్తుందని చెప్పారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చలాన్లు విధించడం ద్వారా, శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తామని అధికారులు వివరించారు. ప్రపంచంలోనే తొలిసారిగా శబ్ద కాలుష్యాన్ని డిటెక్ట్ చేసే రాడార్ని ఉపయోగిస్తున్న ఘనత అబుదాబీకి దక్కుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







