సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు

- May 06, 2022 , by Maagulf
సేవ్ సాయిల్: ఈ నెల 15న బహ్రెయిన్ చేరుకోనున్న సద్గురు

మనామా: భారత ఆధ్మాతిక లీడర్ మరియు యోగి సద్గురు, సేవ్ సాయిల్ అనే నినాదంతో 100 రోజుల మోటర్ సైకిల్ జర్నీని యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియాకి ప్రారంభించారు. మే 15న ఈ యాత్ర బహ్రెయిన్ చేరుకోనుంది. మార్చి 20న లండన్‌లో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆమ్‌స్టర్‌డామ్, బెర్లిన్, ప్రేగ్యు, వియెన్నా, లిజుబేనియా, రోమ్, జెనీవా, ప్యారిస్, బ్రస్సెల్స్, కోలోగ్న్, ఫ్రాంక్‌ఫర్ట్, బ్రతిస్లవా, బుడాపెస్ట్, బెల్‌గ్రేడ్, సోఫియా, బుచారెస్ట్, ఇస్తాంబుల్, తబ్లిసి , బాకు మరియు అమ్మాన్‌ల మీదుగా ఈ యాత్ర సాగుతోంది. తదుపరి రియాద్‌కి 64 ఏళ్ళ గురు యాత్ర చేరుకుంటుంది. సౌదీ అరబియా, యూఏఈ, మస్కట్ తదితర దేశాల్లో ఈ యాత్ర చేపడతారు.
మనామాలో ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి ఈ  http://savesoil.org/Manama లింకు లో వివరాలు  నమోదు చేసుకోగలరు. 

 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com