ఆందోళన
- May 07, 2022ప్రపంచంలో ఒక పక్క యుద్ధం జరుగుతోంది,ఇంకో పక్క రెండు సంవత్సరాల క్రిందట మొదలైన కరోనా వైరస్ తగ్గనేలేదు,తల్లితండ్రుల నుండి దూరంగా ఉంటూ వాళ్ళని మిస్ అవుతున్నామని బాధ,ఉద్యోగం ఉంటుందో లేదో అని బాధ, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో లేదో అని బెంగ,పిల్లలు సరిగ్గా చదువుతున్నారో లేదో అని బెంగ.
ఇన్ని విషయాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆందోళన కలగటం సర్వ సాధారణం .
మరి ఇన్ని జరుగుతున్నా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం కుదురుతుందా?
ఏ మనిషికైనా ఎల్లప్పుడూ ఆనందం గా ఉండటం కుదరదు.అలా అని నిరాశలోను ఉండిపోకూడదు.అలాంటి మధ్యస్థ స్థితి ఒకటి ఉంటుందా? ఉంటే అది చేరుకోవటం ఎలా?
దానికి కావల్సినది ముఖ్యంగా
1. మనం మార్చ లేని మరియు మన చేతుల్లో లేని విషయాలు ఏమిటి అని తెలుసుకోవటం మరియు అటువంటి వాటిని అంగీకరించటం.
2. మనం మార్చగలిగే శక్తి ఉన్న వాటిని ధైర్యంగా చెయ్యటం.
3. ఈ రెండిటి మధ్య తేడా ని వివేకం తో చూడగలగడం.
ఉదాహరణ:
ప్రపంచలో దేశాలు యుద్ధం చేసుకుంటుంటే మనం ఆందోళన పడకుండా ఉండాలంటే వార్తలు తక్కువ వినడం చేస్తే చాలు అంతకంటే మనం చెయ్య గలిగినది ఏమీ లేదు అని తెలుసుకోవాలి.
కరోనా రాకుండా ఉండాలంటే మనం చెయ్యవలసినవి వాక్సిన్ వేసుకోవటం, మాస్క్ పెట్టుకోవటం,రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరగకుండా ఉండటం లాంటివి మనం చేతుల్లో ఉన్న వాటిని చెయ్యగలగాలి.
ఉద్యోగ విషయంలో కూడా మన కృషి లోపం లేకుండా పని చెయ్యాలి.
పిల్లల చదువు లేదా భవిష్యత్తు కోసం మన వంతుగా మనమేమి చెయ్యగలం అన్నది మనం 100 % చెయ్యగలిగితే .
ఇంక ఆందోళన లేకుండా దేనినైనా ధైర్యంగా ఎదుర్కోగలం.
--ఉమాదేవి వాడ్రేవు
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం