ప్రముఖ వ్యాపారవేత్తకు సన్మానం
- May 07, 2022
బహ్రెయిన్: ప్రముఖ వ్యాపారవేత్త, విజనరీ ఇంజనీర్ కెజి బాబురాజన్కి ఘన సన్మానం జరిగింది. ఇసా టౌన్‌లోని ఇండియన్ స్కూల్ ఆడిటోరియంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. భారత పార్లమెంటు సభ్యుడు ఎంకె ప్రేమచందన్, కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోసిఝన్ డాక్టర్ ఎంకె మునీర్, భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, శ్రీ నారాయణ ధర్మ సంఘం ప్రెసిడెంట్ భ్రహ్మశ్రీ సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ నారాయణ ధర్మ సంఘం కమిటీ కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మలయాళ నటి నవ్యా నాయర్ క్లాసికల్ డాన్స్ ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. బికెజి హోల్డింగ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కెజి బాబురాజన్ కీలక ప్రసంగం చేశారు. ప్రవాసీ భారతీయ సన్మాన్ పురస్కార గ్రహీత బాబురాజన్, స్టేంజర్ ఇండస్ట్రీస్ సహా పలు ప్రాజెక్టులు చేపట్టారు. బహ్రెయిన్ - సౌదీ కాజ్వే ప్రాజెక్టు కోసం పని చేశారాయన. హై రైజ్ బిల్డింగులు, డ్రెడ్జింగ్, ఆఫ్ షోర్ ఇన్స్టలేషన్స్ సహా పలు ప్రాజెక్టుల్ని ఆయన విజయవంతంగా చేపట్టారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









