సందర్శకులను అలరించనున్న ‘యాట్స్ మెరీనా’

- May 08, 2022 , by Maagulf
సందర్శకులను అలరించనున్న ‘యాట్స్ మెరీనా’

సౌదీ: జెడ్డా యాచ్ క్లబ్ మెరీనా ఆదివారం జెడ్డా సీజన్ 2022 సందర్శకులను అలరించనుంది. వాటర్ ఫ్రంట్‌లో ఏర్పాటైన వివిధ రకాల రెస్టారెంట్లు, కేఫ్‌లు సందర్శలను ఆకట్టుకోనున్నాయి. అద్భుతమైన సముద్ర వీక్షణకు మెరీనా యాచ్ క్లబ్ జోన్ ప్రసిద్ధి చెందింది. జెడ్డా వాటర్‌ఫ్రంట్‌ సీజన్‌లో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్‌లు, ఫ్యాషన్, లగ్జరీ షాపింగ్‌తో సహా అనేక రకాల వస్తువులు అక్కడ లభిస్తాయి. క్లబ్‌లో 135 మీటర్ల ఎత్తులో ఉన్న ఓడలు, పడవలు అందుబాటులో ఉంటాయి. మెరీనా క్లబ్ 100 పడవలను నిర్వహించే సామర్థ్యం ఉంది. జెడ్డా యాచ్ క్లబ్ సభ్యుల కోసం ప్రైవేట్, ప్రత్యేకమైన బీచ్‌ను కలిగి ఉంది. ఇది బహ్రెయిన్ లో మొదటి పర్యాటక మెరీనాగా గుర్తింపు పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com