మొహర్రాక్‌లో మొదటి మల్టీ స్టోర్ కార్ పార్కింగ్ ప్రారంభం
- May 08, 2022
మనామా: ముహర్రక్‌లోని పెరల్ పాత్‌లో మొదటి మల్టీ స్టోర్ కార్ పార్కింగ్‌ను బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) ఆదివారం ప్రారంభించనుంది. పెర్ల్ పాత్‌లో మరో మూడు మల్టీ స్టోర్ పార్కులు కూడా 2022 చివరి నాటికి లేదా 2023 ప్రారంభంలో పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. ఆర్సినల్స్ ఇంజినీరింగ్ డిజైన్ సహకారంతో ఆర్కిటెక్ట్ క్రిస్టియన్ కెరెజ్ ఈ నిర్మాణాలను రూపొందించారు. కొత్త పార్కింగ్ లాట్‌లోని ప్రతి ఫ్లోర్ విభిన్నమైన ఆకృతిని, డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టులను ప్రముఖ నిర్మాణ కంపెనీ అయిన అబ్దుల్‌మోసెన్ అల్ ఖరాఫీ అండ్ సన్స్ నిర్మిస్తోంది. పెర్ల్ పాత్ బహ్రెయిన్ కోట తర్వాత యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ఎక్కిన రెండవ ఐకానిక్ వెస్టేజ్ గా గుర్తింపు పొందింది. నగరంలోని నివాసితులు, సందర్శకులకు పెరల్ పాత్ ప్రదేశానికి పార్కింగ్‌ను అందించడం, ముహరక్ సిటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







