చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను షేర్ చేస్తే 10 మిలియన్ల జరిమానా
- May 08, 2022
యూఏఈ: చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్‌లో భాగం కావడం లేదా స్టోర్ చేయడం, దాన్ని షేర్ చేయడం లాంటి చర్యలకు పాల్పడితే Dh300,000 నుంచి గరిష్టంగా Dh10 మిలియన్ల వరకు పెనాల్టీని విధించనున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఫెడరల్ డిక్రీ లా 34 2021లోని ఆర్టికల్ 53 ప్రకారం పుకార్లు, ఇ-క్రైమ్‌లను ఎదుర్కోవడమే లక్ష్యంగా జరిమానాలు విధించబడ్డాయని పేర్కొంది. చట్టం ప్రకారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను స్టోర్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి లేదా ప్రచురించడానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా ఖాతాను ఉపయోగించే ఎవరైనా, అధికారిక ఆర్డర్‌లలో పేర్కొన్న వ్యవధిలో అటువంటి మెటీరియల్‌ను తొలగించాలని, లేదంటే జరిమానా విధించబడుతుందని అందులో పేర్కొన్నారు. అలాగే డిక్రీలో పేర్కొన్న కంటెంట్‌ను తీసివేయడానికి పూర్తిగా లేదా పాక్షికంగా నిరాకరించిన వ్యక్తి కూడా శిక్షకు బాధ్యుడు అవుతాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







