కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సమావేశం..
- May 10, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో మే 11 న బుధవారం నాడు ఓపెన్ హౌస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. భారత రాయబారి సిబి జార్జ్ ఈ కార్యక్రమం ద్వారా కువైట్ లోని భారత ప్రవాసుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చిస్తారు.ఫహహీల్‌లోని బీఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ సెంటర్లో బుధవారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.కువైట్ లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే.అయితే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలి.ఈసారి ఈ ఈవెంట్ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం లేదని రాయబార కార్యాలయం వెల్లడించింది.కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రవాసులు నేరుగా ఫహహీల్‌లోని బీఎల్ఎస్ ఔట్సోర్సింగ్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం.,సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైట్ లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన [email protected] కు ఈ-మెయిల్ చెయ్యాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







