విశ్వక్సేనుడు ‘అశోక వనం’తో గట్టిగా కొట్టాడుగా.!
- May 10, 2022అల్లు అర్జున్ సినిమాలో డైలాగ్ వుంటుంది కదా.. క్లాస్‌లో బాగా చదివినోడు కాదు.. ఎగ్జామ్ హాల్లో అన్ని ప్రశ్నలకూ బాగా సమాధానం రాసినోడే టాపర్ అవుతాడు..’ అనే డైలాగ్ మాదిరి సినిమాలు చేయడమే కాదు. ఆ సినిమాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో కూడా తెలిసినోడే అసలు సిసలు హీరో అనిపించుకుంటాడు.
ప్రస్తుతం అలాగే అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు యంగ్‌స్టర్ విశ్వక్సేన్. అదేనండీ ‘ఫలక్ నుమా దాస్’, ‘పాగల్’ తదితర సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకున్న నటుడు విశ్వక్ సేన్. కంటెంట్‌తో పని లేకుండా పబ్లిసిటీ స్టంట్‌తోనే మనోడి సినిమాలు ఆడియన్స్ సోదిలో నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో.
లేటెస్టుగా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. ఈ సినిమా కూడా అంతే, బడ్జెట్‌తో సంబంధం లేకుండా భారీగా వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. అందుకు కారణం మనోడి పబ్లిసిటీ స్టంట్ టాలెంటే మరి.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రిలీజ్‌కి ముందు టీవీ 9 జర్నలిస్టు దేవీ నాగవల్లితో విశ్వక్ సేన్ గొడవకు దిగిన ముచ్చట ఈ మధ్య పెద్ద రచ్చయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌కి ఆ గొడవ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తన గత చిత్రాల విషయంలోనూ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లే చేశాడు విశ్వక్ సేన్.
లో బడ్జెట్లో సినిమాలు చేసేస్తాడు విశ్వక్ సేన్. తనదైన స్టయిల్లో పబ్లిసిటీలు ప్లాన్ చేసుకుంటాడు. ఇంతవరకూ బాగానే వర్కవుట్ అయ్యాయ్. చిన్న సినిమాలే అయినా, పెద్ద విజయాలు అందుకుంటున్నాయ్ మనోడి పబ్లిసిటీ స్టంట్ టాలెంట్ ఏమో కానీ, అన్నిసార్లూ ఈ పబ్లిసిటీ ట్రిక్స్ వర్కువుట్ అవుతాయా.. విశ్వక్ సేనా.? జర ఆలోచించుకో మరి.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం