భారత్‌లో పర్యటించనున్న ఒమనీ వాణిజ్య ప్రతినిధి బృందం
- May 11, 2022
మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) ప్రతినిధి బృందం భారత్ లో పర్యటించనుంది. భారత పర్యటనలో పాల్గొంటున్న వారిలో ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ ఆర్థిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఉన్నారు. ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ రిధా బిన్ జుమా అల్ సలేహ్ ఒమన్ పర్యటనకు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వం, అనేక మంది అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సజావుగా సాగేందుకు అవసరమైన విధానాల గురించి వీరు చర్చలు జరుపుతారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి అవకాశాలు, సౌకర్యాలను పరిచయం చేసే లక్ష్యంతో "ఇన్వెస్ట్ ఇన్ ఒమన్" ఫోరమ్ ను నిర్వహిస్తారు. వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించే మార్గాలను చర్చించడానికి ఇరు దేశాల వ్యాపారవేత్తల మధ్య ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నట్లు అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







