ఉపాధి ఒప్పంద ఇ-సేవ అప్‌గ్రేడ్: ఖతార్ కార్మిక శాఖ

- May 11, 2022 , by Maagulf
ఉపాధి ఒప్పంద ఇ-సేవ అప్‌గ్రేడ్: ఖతార్ కార్మిక శాఖ

దోహా: కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) ఉపాధి ఒప్పంద ప్రమాణీకరణ ఇ-సేవను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కాంట్రాక్ట్ ప్రామాణీకరణ అభ్యర్థనలు నిమిషాల్లో ఆటోమెటిక్ గా పూర్తి అవుతాయి. కొత్త ఆటోమేటెడ్ కాంట్రాక్ట్ ఆడిటింగ్ సర్వీస్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌ల ఆడిటింగ్ అవసరమయ్యే ప్రత్యేక వృత్తులకు సంబంధించిన వర్క్ కాంట్రాక్ట్ లు మినహా అన్ని వర్క్ కాంట్రాక్టులు ఉన్నాయని లేబర్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అబ్దుల్లా అల్-దోసరి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఆడిటింగ్ కాంట్రాక్ట్ సర్వీస్ ప్రక్రియ కార్మిక చట్టంలో పేర్కొన్న ప్రమాణాలకు లోబడి ఉంటుందని, పని ఒప్పందాల ప్రమాణీకరణను నియంత్రించే అన్ని మంత్రివర్గ నిర్ణయాలకు లోబడి ఉంటుందన్నారు.  నాన్-స్పెషలిస్ట్ వృత్తుల కోసం ఒప్పందం ఆటోమెటిక్ గా తనిఖీ చేయబడుతుందని, కాంట్రాక్ట్ తో సరిపోలిన తర్వాత, సదరు అధికారి ఎలక్ట్రానిక్ చెల్లింపు గేట్‌వే ద్వారా ఫీజులను చెల్లించాలని సూచించారు. ప్రక్రియ పూర్తి అయిన తర్వాత డిజిటల్ సర్టిఫైడ్ కాపీలు అందుతాయన్నారు. స్మార్ట్ సేవలను అభివృద్ధి చేయడం, కార్మిక రంగంలో ఎలక్ట్రానిక్ సేవల వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడం, సేవలను సులభతరం చేయడం, వేగవంతం చేయడానికి ఈ కొత్త సేవ అందించబడుతుందన్నారు. వర్క్ కాంట్రాక్ట్ కోసం ఏకీకృత పద్ధతిలో ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సర్వీస్ జూన్ 2020లో ప్రారంభించినప్పటి నుండి ప్రభుత్వ సేవా కేంద్రాలను సమీక్షించాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాదాపు 900,000 ఒప్పందాలను ప్రామాణీకరించిందని అల్-దోసరి చెప్పారు. కార్మిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం లేబర్ వీసాల ఫాస్ట్-ట్రాకింగ్, ఫెసిలిటీ డేటాను అప్‌డేట్ చేయడం, వర్క్ కాంట్రాక్ట్ లను ప్రామాణీకరించడం, ఇతర ఎలక్ట్రానిక్ సేవలతో సహా అనేక ఎలక్ట్రానిక్ సేవలను అందిస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com