బిల్ గేట్స్‌కు కరోనా పాజిటివ్..
- May 11, 2022
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనలో కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకునేంతవరకు ఐసోలేట్ అవుతానని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో టీకాలు వేయించడం, బూస్టర్ డోసులు, కొవిడ్ టెస్టులు చేయించుకునే వెసులుబాటుతో పాటు మంచి వైద్యులు అందుబాటులో ఉండటం తన అదృష్టమని గేట్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీటెల్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రైవేట్ ఫౌండేషన్ గా పేరొంది. ఎండోమెంట్ సుమారు 65 బిలియన్లు డాలర్లుగా ఉంటుంది.
బిల్ గేట్స్ కరోనా నిర్మూలనలో ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్లు, మందులు అందేలా ఎంతో కృషి చేశారు. అక్టోబరులో గేట్స్ ఫౌండేషన్ తక్కువ-ఆదాయ దేశాల కోసం.. డ్రగ్‌మేకర్ మెర్క్ యాంటీవైరల్ COVID-19 పిల్ జెనరిక్ వెర్షన్లకు యాక్సెస్‌ను పెంచడానికి 120 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.
గతంలో బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని సూచించారు. భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ, పేటెంట్లకు సంబంధించి బిల్ గేట్స్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







