హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్
- May 11, 2022
హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు...ముఖ్యంగా గల్ఫ్,మలేసియా లాంటి 18 ఈసీఆర్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల కోసం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసి సహాయతా కేంద్రం (మైగ్రంట్స్ హెల్ప్ డెస్క్) ను ఈ రోజు ఉదయం ప్రారంభించారు.
ఎయిర్‌పోర్టు నిర్వహిస్తోన్న జీఎంఆర్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) లు సంయుక్తంగా ఈ హెల్ప్‌డెస్క్‌ని ఏర్పాటు చేశాయి.
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రాణి కుముదిని ఈ హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. టాంకాం అధికారి నాగభారతి, ఎన్నారై అధికారి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
అమెరికా వెళుతున్న విద్యార్థి బేతి యశ్వంత్ రెడ్డితో కలిసి వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి సాయంత్రం విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వద్ద ఉన్న ఈ హెల్ప్ డెస్క్ ను సందర్శించారు.టాంకాం అధికారి నాగభారతి, హెల్ప్ డెస్క్ ఇంచార్జి ఫణి కుమార్ లను ఈ సందర్బంగా అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







