కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి
- May 13, 2022
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారని ఎస్ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.
ఈ ప్రమాదం గురించి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.10 గంటల సమయంలో ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని చెప్పారు.హెలికాప్టర్ ను ల్యాండ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని తెలిపారు.ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోయారని… ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో ఇతర ప్రయాణికులు ఎవరూ లేరని వెల్లడించారు.
అయితే ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై డీజీసీఏ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించాయి.ఈ ప్రమాదం పట్ల ఛత్తీస్ గఢ్ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.మృతి చెందిన పైలట్లకు సంతాపాన్ని ప్రకటించారు.వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







