ఉత్తర కొరియాలో కరోనా కలకలం..తొలి కరోనా మరణం
- May 13, 2022
సియోలా: ఉత్తరకొరియాలో కరోనా తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే.ఇప్పుడు మరి కొంత మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.అంతేకాదు,ఓ కరోనా బాధితుడు మృతి చెందాడని ఉత్తరకొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్యాంగాంగ్ లో తాజాగా జ్వరంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా..వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్పష్టమైంది. మృతుడిలో ఒమిక్రాన్ బీఏ.2ను గుర్తించారు.
ఉత్తరకొరియాలో ప్రస్తుతం 1,87,800 మంది జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.వారందరినీ ఐసోలేషన్ లో ఉంచినట్లు వివరించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్ విధించారు.అక్కడ ఇంకా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభం కాలేదు.వ్యాక్సిన్ లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినప్పటికీ ఉత్తరకొరియా ఇంతకు ముందు తిరస్కరించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







