వ్యక్తి దవడ నుంచి తలలోకి దూసుకెళ్లిన ఇనుప చువ్వ..
- May 13, 2022
కరీంనగర్: ప్రమాదవశాత్తూ ఇనుప చువ్వ ఓ వ్యక్తి తలలోకి దిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. కాల్వ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుడు పట్టుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోంది. అతన్ని కాపాడేందుకు తోటివాళ్లంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇనుప కట్టర్‌తో కల్వర్టు రాడ్‌ను కట్ చేసి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దవడ భాగంలో గుచ్చుకున్న ఇనుపరాడ్ బుర్రను చీల్చుకుంటూ రెండుగుల మేర బయటకు వచ్చేయడంతో.. దాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ సీరియస్‌గానే ఉందంటున్నారు వైద్యులు.
-- లక్ష్మినారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







