ఉక్రెయిన్ విడిచి వెళ్లిన 60 లక్షల మంది: ఐరాస
- May 13, 2022
జెనీవా : ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఉక్రెయిన్ మొత్తం జనాభా 3 కోట్ల 70 లక్షలుగా ఉండగా, ఇప్పటివరకు మొత్తం 60 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ను వదిలి ఇతర దేశాలకు వెళ్లారని ఐక్యరాజ్య సమితి తాజాగా తెలిపింది. వారిలో మహిళలు, పిల్లలే 90 శాతం మంది ఉన్నారని వివరించింది.
ఉక్రెయిన్ నుంచి అధిక మంది పోలండ్ కు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారని, పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉండడంతో ఉక్రెయిన్‌లోనే ఉంటుందున్నారని పేర్కొంది. ఉక్రెయిన్ లో మరో 80 లక్షల మంది సొంత దేశంలో పలు ప్రాంతాలకు మారారని తెలిపింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులు దాటుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని చెప్పింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. మార్చి నెలలో ఉక్రెయిన్ నుంచి 30 లక్షల మందికి పైగా ప్రజలు విదేశాలకు వెళ్లారు. ఏప్రిల్ నాటికి వలస వెళ్లిన వారి సంఖ్య 10 లక్షల మందికి పైగా చేరింది. ఈ నెల 4,93,000 మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటారు. 2022 ముగిసేలోపు మొత్తం 80 లక్షల మంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







