వ్యక్తి దవడ నుంచి తలలోకి దూసుకెళ్లిన ఇనుప చువ్వ..
- May 13, 2022కరీంనగర్: ప్రమాదవశాత్తూ ఇనుప చువ్వ ఓ వ్యక్తి తలలోకి దిగిపోయిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. కాల్వ నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుడు పట్టుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కనిపిస్తోంది. అతన్ని కాపాడేందుకు తోటివాళ్లంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇనుప కట్టర్‌తో కల్వర్టు రాడ్‌ను కట్ చేసి వెంటనే అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దవడ భాగంలో గుచ్చుకున్న ఇనుపరాడ్ బుర్రను చీల్చుకుంటూ రెండుగుల మేర బయటకు వచ్చేయడంతో.. దాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ సీరియస్‌గానే ఉందంటున్నారు వైద్యులు.
-- లక్ష్మినారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక