APNRTS కువైట్ వారి సహకారంతో స్వస్థలానికి చేరుకున్న ఏపీ వాసి
- May 14, 2022
కువైట్ సిటీ:అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం గాంధీ నగర్ కు చెందిన మల్ల బోయిన ఉమా మహేశ్వర్ జీవనోపాధి కొరకు గత 8 సంవత్సరాల క్రితం కువైట్ కు వచ్చి కువైటీ ఇంట్లో పని చేసుకుంటున్నాడు.తన యజమాని గత 8 సంవత్సరాల నుండి జీతం సరిగా ఇవ్వక ఇండియాకు పంపక చాలా చిత్ర హింసలకు గురిచేశాడు.ఆకారణంగా,యజమాని ఇంటి నుండి,గత రెండు నెలల క్రిందట బయటకు వచ్చేసి, ఆరోగ్యం సరిగా లేని కారణంగా, కువైట్ లో తనకు నా అనేవారు, లేని కారణంగా APNRTS రీజినల్ కో-ఆర్డినేటర్ (కువైట్ ) నాయిని మహేశ్వర రెడ్డి ని సంప్రదించి, తను స్వదేశానికి వెళ్లిపోతానని, తనకు సహాయం అందించాలని కోరాడు .
ఈ విషయం పై నాయిని మహేశ్వర రెడ్డి,సత్వరం స్పందించి, అతనికి, సహాయ సహకారాలు అందించారు.కువైట్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి సంబంధిత పేపర్ వర్కు పనులు పూర్తి చేయించి అతనిని ఈ రోజు స్వదేశానికి పంపించారు.అతనికి దారి ఖర్చుల నిమిత్తం కువైట్ లోని రాజన్న సేవా సమితి వారు ఆర్థిక సహాయం చేశారు.
ఈ సందర్బంగా,మహేశ్వర్ మాట్లాడుతూ,తనకు కువైట్ లో సహాయ సహకారాలు అందించిన, APNRTS రీజనల్ కో-ఆర్డినేటర్,నాయిని మహేశ్వర రెడ్డి పాలతోట మణి,రాజన్నసేవా సమితి సభ్యులకు,వైఎస్ఆర్సిపీ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి,APNRTS కువైట్, ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి,APNRTS ఛైర్మెన్ మేడపాటి వెంకట్, డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్, భారత రాయబార కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







