AED3.8Bకి తగ్గిన ‘ఎమిరేట్స్’ వార్షిక నష్టాలు

- May 16, 2022 , by Maagulf
AED3.8Bకి తగ్గిన ‘ఎమిరేట్స్’ వార్షిక నష్టాలు

దుబాయ్: కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ గ్రూప్ AED3.8 బిలియన్ ($1 బిలియన్) వార్షిక నష్టాన్ని నమోదు చేసింది. కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గడం, ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడంతో ఎమిరెట్స్ వార్షిక నష్టాలు గత సంవత్సరం కంటే తగ్గాయని కంపెనీ నివేదిక తెలిపింది. గ్రూప్ గత సంవత్సరంలో AED22.1 బిలియన్ ($6 బిలియన్) నష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 2021-22 వార్షిక నివేదిక (మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరానికి) లాభదాయకత, గణనీయమైన ఆదాయ మెరుగుదల, వ్యాపారాలలో బలమైన పునరుద్ధరణను చూపింది. గ్రూప్ ఆదాయం AED66.2 బిలియన్ ($18.1 బిలియన్), గత సంవత్సరం ఫలితాల కంటే 86% పెరుగుదల నమోదు చేసింది. గ్రూప్ నగదు నిల్వ AED25.8 బిలియన్లు ($7 బిలియన్లు), గత సంవత్సరం కంటే 30% పెరిగింది. 2021-22లో ఎమిరేట్స్ దుబాయ్ ప్రభుత్వం నుండి AED3.5 బిలియన్ల ($954 మిలియన్లు) మూలధన ఇంజెక్షన్‌ను అందుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com