కువైట్ లో విమానాల రాకపోకలు పునరుద్ధరణ
- May 17, 2022
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్ధరించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దేశంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటన్నర పాటు విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయని, సాయంత్రం ఆరు గంటలకు విమాన రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ విమానాలను రీషెడ్యూల్ చేసినట్లు ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇమాద్ అల్-జలావి తెలిపారు. దేశంలో ప్రస్తుతం గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో చురుకైన గాలులతో కూడిన దుమ్ము కారణంగా సమాంతర దృశ్యమానత తగ్గిందని, ఇది విమాన సర్వీసులపై ప్రభావం చూపుతోందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







