యువ ఫుట్‌బాల్ అభిమానులను కలుసుకున్న పీఎస్జీ ప్లేయర్స్
- May 17, 2022
దోహా: ఖతార్‌లోని ఎడ్యుకేషన్ సిటీలో పీఎస్జీ అకాడమీ, ఖతార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ స్పోర్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా పారిస్ సెయింట్-జర్మన్‌కు చెందిన ఫుట్‌బాల్ స్టార్ ఫుట్ బాల్ ఆటగాళ్లు యువ ఫుట్‌బాల్ అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో వారు ఇంటరాక్షన్ అయ్యారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఖతార్ ఫౌండేషన్ ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్‌లో భాగమైన అవ్సాజ్ అకాడమీలో 100 మందికి పైగా పిల్లలు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌లను ప్రశ్నించారు. సెషన్‌లో భాగంగా ఆటగాళ్ళు ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించినప్పటి నుండి గ్లోబల్ స్టార్‌లుగా ఎదిగిన క్రమాన్ని యువ అభిమానులతో పంచుకున్నారు. చిన్నారులతో ఫోటోలు దిగడంతోపాటు వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వారిని సంతోషపెట్టారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







