కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు రైలు మార్గం

- May 18, 2022 , by Maagulf
కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు రైలు మార్గం

యూఏఈ: కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు కొత్త రైలు మార్గం అందుబాటులోకి రానుంది. సమీప భవిష్యత్తులో 2,177 కి.మీ జీసీసీ రైల్వే నెట్‌వర్క్ అరబ్ దేశాలతో కూడా అనుసంధానించబడుతుందని అబుదాబిలో యూఏఈ ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రోయి తెలిపారు. అన్ని గల్ఫ్ దేశాలు తమ సొంత నెట్‌వర్క్ లను నిర్మించుకోవడంతో జీసీసీ-వైడ్ రైల్వే లైన్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రయాణీకులు కువైట్ సిటీ నుండి అబుదాబి మీదుగా మస్కట్‌కు రైలు ప్రయాణం గురించి కలలు కనేవారని, అది త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందన్నారు. మిడిల్ ఈస్ట్ రైల్ 16వ ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. జీసీసీ దేశాలచే రైల్వే నెట్‌వర్క్ ను నిర్మించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com