నిర్మాణ ప్రదేశాలలో భద్రతా నిబంధనలను పాటించాలి: ఖతార్
- May 18, 2022
ఖతార్: నిర్మాణ ప్రదేశాలలో కార్మికులను రక్షించే ప్రయత్నాలలో భాగంగా కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలను అనుసరించాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL) పిలుపునిచ్చారు. యజమానులు వాతావరణ, గాలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వాటికి తగినట్టుగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందరు యజమానులు పని ప్రదేశాలలో భద్రతా విధానాలను అనుసరించాలని, గాలి వేగాన్ని కొలవడానికి కచ్చితమైన పరికరాలను ఉపయోగించాలని సూచించింది. గాలి వేగం అనుమతించదగిన పరిమితిని మించి ఉన్నప్పుడు క్రేన్ ఆపరేషన్ను నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. భద్రతా విధానాల అమలును నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు పని ప్రదేశాలను సందర్శిస్తారని పేర్కొంది. మరోవైపు వాతావరణంలో దుమ్ము ధూళి క్రమంగా తగ్గుతుందని, తాజా వాయువ్య గాలి ఈ వారాంతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు వాయువ్య దిశలో 13, 23 నాట్ల మధ్య వేగంతో వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు 31 నాట్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









