నిర్మాణ ప్రదేశాలలో భద్రతా నిబంధనలను పాటించాలి: ఖతార్

- May 18, 2022 , by Maagulf
నిర్మాణ ప్రదేశాలలో భద్రతా నిబంధనలను పాటించాలి: ఖతార్

ఖతార్: నిర్మాణ ప్రదేశాలలో కార్మికులను రక్షించే ప్రయత్నాలలో భాగంగా కార్మికుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలను అనుసరించాలని కార్మిక మంత్రిత్వ శాఖ (MoL)  పిలుపునిచ్చారు. యజమానులు వాతావరణ, గాలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వాటికి తగినట్టుగా భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందరు యజమానులు పని ప్రదేశాలలో భద్రతా విధానాలను అనుసరించాలని, గాలి వేగాన్ని కొలవడానికి కచ్చితమైన పరికరాలను ఉపయోగించాలని సూచించింది. గాలి వేగం అనుమతించదగిన పరిమితిని మించి ఉన్నప్పుడు క్రేన్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని  మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. భద్రతా విధానాల అమలును నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్టర్లు పని ప్రదేశాలను సందర్శిస్తారని పేర్కొంది. మరోవైపు వాతావరణంలో దుమ్ము ధూళి క్రమంగా తగ్గుతుందని, తాజా వాయువ్య గాలి ఈ వారాంతం వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గాలులు వాయువ్య దిశలో 13, 23 నాట్ల మధ్య వేగంతో వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొన్నిసార్లు 31 నాట్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com