వినియోగదారులకు ఇ-చెల్లింపులు తప్పనిసరి: ఒమన్
- May 18, 2022
మస్కట్: వినియోగదారులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను తప్పనిసరిగా అందించాని వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) వెల్లడించింది. ఈ మేరకు వినియోగదారులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవలను అందించడంపై మంత్రిత్వ శాఖ 386/2022 ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం.. నిర్దేశిత రంగాల్లో ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవను అందించడానికి కట్టుబడి ఉండని వాణిజ్య సంస్థలు, కంపెనీలకు జరిమానా విధించబడుతుందని ప్రకటించింది. ఆర్టికల్ (1) ప్రకారం.. ఆహార పదార్థాలు, బంగారం, వెండి, రెస్టారెంట్లు, కేఫ్‌లు, కూరగాయలు, పండ్లు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ వస్తువులు, పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, అలాగే పారిశ్రామిక జోన్‌లు, కాంప్లెక్స్ లలో అన్ని కార్యకలాపాలను నిర్వహించే సంస్థలు, మాల్స్, గిఫ్ట్ మార్కెట్‌లు వినియోగదారులందరికీ ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవను అందించడం తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO), ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI), కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) లను వినియోగదారులు ఎలక్ట్రానిక్‌గా లేదా నగదు ద్వారా చెల్లించడాన్ని ఎంచుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రి మండలి నిర్ణయం.. 386/2022 రాయల్ డిక్రీ 55/90 ద్వారా ప్రకటించబడిన వాణిజ్య చట్టానికి, రాయల్ డిక్రీ 18/2019 ద్వారా ప్రకటించబడిన వాణిజ్య కంపెనీల చట్టానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!
- ఖతార్ లో పాస్‌పోర్ట్ డైరెక్టరేట్‌కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!
- కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- జెబెల్ అలీలో ప్రారంభమైన సూపర్ బజార్ హైపర్‌మార్కెట్..అపూర్వ ఆదరణ..!!
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు









