కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- March 30, 2026
కువైట్ః క్షిపణులు, డ్రోన్లతో ఒక సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో 10 మంది సాయుధ దళాలు గాయపడ్డాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశ గగనతలంలోకి ప్రవేశించిన 14 బాలిస్టిక్ క్షిపణులను, 12 డ్రోన్లను కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అధికార ప్రతినిధి సౌద్ అల్-అత్వాన్ తెలిపారు. ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, కొన్ని క్షిపణులు ఒక సైనిక స్థావరంపై పడిందని తెలిపారు. గాయపడిన సిబ్బంది చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ దాడిలో ఒక ప్రైవేట్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వేర్ హౌజ్ ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని, దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం ఆస్తి నష్టం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 28 నుంచి కువైట్ 307 బాలిస్టిక్ క్షిపణులు, రెండు క్రూయిజ్ క్షిపణులు, 616 డ్రోన్లను ఎదుర్కొందని అల్-అత్వాన్ వెల్లడించారు. సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, దేశ భద్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలను కొనసాగిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







