దుబాయ్ లో ఇంటర్‌సిటీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ

- May 18, 2022 , by Maagulf
దుబాయ్ లో ఇంటర్‌సిటీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ

దుబాయ్: కోవిడ్-19 సంఖ్యలు తగ్గడంతో పరిమితులు సడలించారు. దీంతో ఎక్కువ మంది ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించడం మొదలుపెట్టారు. డిమాండ్‌ను తీర్చడానికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (RTA)  మే 19 నుండి 4 ఇంటర్‌సిటీ బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తోంది. దుబాయ్ నుండి పునఃప్రారంభించబడే నాలుగు ఇంటర్‌సిటీ బస్సు మార్గాలు.. అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి అబుదాబికి E100, అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుండి అల్ ఐన్ వరకు E201, ఎటిసలాట్(Etisalat) మెట్రో స్టేషన్ నుండి మువైలేహ్, షార్జా వరకు E315, ఎతిహద్ (Etihad) బస్ స్టేషన్ నుండి ఫుజరహ్(Fujarah) E700 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మే 19న జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ మెట్రో స్టేషన్ నుండి మరో కొత్త మార్గం ప్రారంభించబడుతుంది. F38 అని పిలువబడే ఈ మార్గం మెట్రో లింక్, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ వరకు అనేక జిల్లాల గుండా వెళుతుందని ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com