ఆదివారం వరకు ఇసుక తుపాన్లపై హెచ్చరిక

- May 18, 2022 , by Maagulf
ఆదివారం వరకు ఇసుక తుపాన్లపై హెచ్చరిక

యూఏఈ: దేశవ్యాప్తంగా దుమ్ము ధూళితో కూడిన తుపాన్లు సంభవించవచ్చునని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. యూఏఈ వ్యాప్తంగా ఈ పరిస్థితులు వుంటాయి. ఇసుక ఎగరి పడుతుంది గనుక, విజిబిలిటీ తక్కువగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ వెస్టర్న్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత తీవ్రంగా వుండవచ్చు. అబుదాబీని ఇసుక తుపాను చుట్టుముట్టిన దరిమిలా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ క్వాలిటీ కూడా అబుదాబీలో తక్కువగా వుంది. వాహనాల్ని జాగ్రత్తగా నడపాల్సిందిగా అబుదాబీ పోలీసులు వాహనదారులకు సూచించారు. కాగా, అబుదాబీలో 39 డిగ్రీలు, దుబాయ్‌లో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com