బహ్రెయిన్ లో ప్రారంభమైన 13వ గల్ఫ్ ఫోరమ్‌

- May 19, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రారంభమైన 13వ గల్ఫ్ ఫోరమ్‌

బహ్రెయిన్ : 13వ గల్ఫ్ ఫోరమ్ ను బహ్రెయిన్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్ ప్రారంభించారు. “ఇన్స్టిట్యూషనల్ నెట్‌వర్కింగ్ ఈజ్ ఏ నెససిటీ ఫర్ సోషల్ ప్రొఫెషన్స్” పేరుతో 13వ గల్ఫ్ ఫోరమ్ ఫర్ సోషల్ సొసైటీస్ అండ్ అసోసియేషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇది జీసీసీ దేశాల మధ్య సామాజిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. రెండు రోజుల ఫోరమ్ లో భాగంగా నెట్‌వర్కింగ్ భావన, మెకానిజమ్స్, ప్రాథమిక అవసరాలను పరిచయం చేయడం, సామాజిక రంగంలో పనిచేస్తున్న అరబ్- అంతర్జాతీయ సంస్థాగత నెట్‌వర్క్ ల అనుభవాలను సమీక్షించనున్నారు. అలాగే ఎన్జీఓ(NGO)ల మధ్య సహకారం, నాలెడ్జ్ షేరింగ్, సంస్థల కోసం నెట్‌వర్క్ లను నిర్మించే దశలు, వాటి పని విధానాలు, అధికారిక సంస్థలు-ఎన్జీఓలలో సామాజిక వ్యవహారాలపై ఆసక్తి, సంస్థాగత నెట్‌వర్కింగ్ నెట్‌వర్క్ లను స్థాపించే అంశాలను ఈ ఫోరమ్ హైలైట్ చేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com