బర్త్‌డే స్పెషల్: యంగ్ టైగర్ ఇకపై పాన్ ఇండియా స్టార్
- May 20, 2022
చిన్న వయసులోనే హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీయార్. నూనూగు మీసాల వయసులోనే స్టార్ హోదా దక్కించుకుని, యంగ్ జనరేషన్‌కి స్పూర్తిగా నిలిచాడు. అందుకే అభిమానులు ఆయన్ని ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటుంటారు
నిజానికి హీరోగా నిలదొక్కుకోవడానికి యంగ్ టైగర్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు హీరోగా పనికొస్తాడా.? అనే అవమానాలు సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది కెరీర్ తొలినాళ్లలో యంగ్ టైగర్. అన్నింటినీ ఎదుర్కొని నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని మూడో జనరేషన్ హీరోగా పునికి పుచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఎన్టీయార్ కెరీర్‌ని టర్న్ చేసిన సినిమా ‘సింహాద్రి’ అని చెప్పుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే 22 కోట్లు కొల్లగొట్టి, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. 9 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా రూపొందిన ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేశాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఆ తర్వాత మళ్లీ కొన్ని ఫెయిల్యూర్స్ చవి చూసినప్పటికీ హీరోగా తన స్టార్ ఇమేజ్‌కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకోవడంలో ఎన్టీయార్ సక్సెస్ అయ్యాడు. లేటెస్టుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హోదా దక్కించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీయార్.
ఎన్టీయార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాల నుంచి డిఫరెంట్ లుక్స్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్లు వదిలారు మేకర్లు. ఎన్టీయార్ ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీయార్. ఇలాంటి సక్సెస్‌ఫుల్ బర్త్‌డేలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ, మనం కూడా ఎన్టీయార్‌కి బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా. హ్యాపీ బర్త్‌డే టు యు ఎన్టీయార్.
తాజా వార్తలు
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్







