అవునా.! మహానటి అంతలా భయపడిందా.?
- May 21, 2022
సినిమాల్లో హీరోయిన్లు, హీరోలను కొట్టడం, తిట్టడం.. సిట్యువేషన్ గట్టిగా డిమాండ్ చేస్తే తన్నడం.. లాంటి సీన్లు కూడా చూస్తుంటాం. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య తదితర స్టార్ హీరోల విషయంలో గతంలోనూ ఇలాంటి సీన్లు చూశాం.
‘కిక్’ సినిమాలో ఇలియానా, మాస్ రాజా రవితేజను కాలితో తన్నేస్తుంది కూడా. సిట్యువేషన్ ఆ సీన్లో అంత గట్టిగా డిమాండ్ చేసింది మరి. సర్లే, ఇప్పుడా ముచ్చట ఎందుకొచ్చిందంటారా.? రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోని, హీరోయిన్ తిట్టే సీన్ వుందట.
ఆ సీన్ చేయడానికి కీర్తి సురేష్ చాలా భయపడిందట. మీ ఫ్యాన్స్ ఊరుకోరు సార్.. నన్ను తిట్టేస్తారు.. అని కీర్తి సురేష్ చెప్పిందట. అలాంటిదేం జరగదమ్మా.. నాది గ్యారంటీ.. అని డైరెక్టర్ పరశురామ్ బతిమలాడి మరీ కీర్తి సురేష్‌తో ఆ సీన్ చేయించాడట. ఆ సీన్ సినిమాలో చాలా బాగా వచ్చిందని మహేష్ చెబుతున్నాడు.
ఈ సినిమాలో కీర్తి సురేష్‌ది కాస్త నెగిటివిటీతో కూడుకున్న బబ్లీ క్యారెక్టర్. ఓ రకంగా చెప్పాలంటే కీర్తి సురేష్‌కి ఈ పాత్ర మంచి పేరే తీసుకొచ్చింది. సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో అంతవరకూ కీర్తిపై వున్న నెగిటివిటీని కూడా ఈ సినిమా బ్రేక్ చేసిందనే చెప్పాలి.
మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నా, ‘సర్కారు వారి పాట’ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్‌తో ధియేటర్లలో దుమ్ము రేపుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







