రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ నీ అమితాబ్‌ సందర్శించారు..

- April 07, 2016 , by Maagulf
రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ నీ అమితాబ్‌ సందర్శించారు..

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కంపెనీ అనే పేరుతో ఓ ఆఫీసును ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్‌ షహెన్‌షా అమితాబ్‌ సందర్శించారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ.. సర్కార్‌ తన ఆఫీసుకు రావడం అద్భుతమైన క్షణమని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు అమితాబ్‌ ఆఫీసుకు వచ్చినప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కంపెనీ లోపలికి వచ్చిన అమితాబ్‌కు వర్మ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి గది తిరుగుతూ మొత్తం ఆఫీసును చూపించారు.
రామ్‌గోపాల్‌వర్మ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ దర్శకులు పూరీ జగన్నాథ్‌, కోనా వెంకట్‌, సుధీర్‌ వర్మ, నటుడు బ్రహ్మాజీ తదితరులు సోషల్‌మీడియా ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మ తన ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com