షారుక్‌ 'ఫ్యాన్‌' మైనపు విగ్రహం..

- April 07, 2016 , by Maagulf
షారుక్‌ 'ఫ్యాన్‌' మైనపు విగ్రహం..

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ సంగ్రహాలయంలో 'ఫ్యాన్‌' మైనపు విగ్రహం రానుంది. ప్రస్తుతం టుస్సాడ్స్‌లో ఉన్న షారుక్‌ విగ్రహాన్నే షారుక్‌ నటిస్తున్న ఫ్యాన్‌ సినిమాలోని 'గౌరవ్‌'లా మార్చి ప్రదర్శనకు ఉంచనున్నారు. గౌరవ్‌ రూపంతో అతని దుస్తులతో సహా ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నట్లు మేడమ్‌ టుస్సాడ్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఎడ్వర్డ్‌ ఫుల్లర్‌ తెలిపారు.ఇంకో విషయమేంటంటే.. ఫ్యాన్‌ షూటింగ్‌ని కొంత భాగం మేడమ్‌ టుస్సాడ్స్‌లోనే చిత్రీకరించారు. సినిమాలోని పాత్రనే మైనపు విగ్రహంలా తయారుచేసి ప్రదర్శనకు ఉంచుతున్నామని అభిమానులు సినిమాపై చూపిస్తున్న ప్రేమని ఈ రూపంలో వారికి తిరిగిస్తున్నామని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అవతార్‌ పనేసర్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com